Ram Charan Bithday: రామ్ చరణ్ పవర్ ఫుల్ ‘పెద్ది’ లుక్ రివీల్.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్!

మెగా ఫ్యాన్స్ కోసం రామ్ చరణ్ నుంచి మాస్ అప్పీల్ కలిగిన సర్‌ప్రైజ్! బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న #RC16 చిత్రానికి ‘పెద్ది’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, మూవీ యూనిట్ ఈ అధికారిక అప్డేట్‌ను విడుదల చేసింది.

చరణ్ లుక్ మరింత ఆసక్తికరంగా మారింది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఉన్న ఆయన రస్టిక్ మాస్ లుక్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ‘ఉప్పెన’ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు దాదాపు రెండేళ్ల పాటు ఈ కథను సిద్ధం చేశారు.

ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర ఓ పవర్‌ఫుల్ అవతారంలో కనిపించనుంది. మైసూర్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న చిత్రయూనిట్, ప్రస్తుతం ఢిల్లీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.

ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే, జగపతిబాబు, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ అందించనున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాకు మరింత హైప్‌ను తీసుకొస్తోంది.

చరణ్ మాస్ లుక్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. ‘పెద్ది’ ఎలా ఉండబోతోందో అనే ఉత్కంఠ మరింత పెరిగింది!

Leave a Reply