డార్లింగ్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం ‘రాజాసాబ్’ ట్రైలర్ మేకర్స్ విడుదల చేశారు. హారర్-కామెడీ నేపథ్యంతో సాగిన ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ వైబ్స్ తో మరింత ఆకట్టుకుంటున్నాడు. ట్రైలర్‌లో ప్రభాస్ కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, హారర్ సన్నివేశాలు, హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాలు ఫ్యాన్స్‌లో పూర్తి జోష్ నింపాయి. మునుపటి ఫుల్ యాక్షన్ మోడ్ సినిమాల తర్వాత, ఇప్పుడు డార్లింగ్ మోడ్‌లో కూల్ గా కనిపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులు చేశాడు.
‘యోగి’ మరియు ‘బుజ్జిగాడు’ సినిమాల తర్వాత మరోసారి ప్రభాస్ తన యూత్ ఫుల్ కామెడీ ప్రతిభను ప్రదర్శించబోతున్నాడు. 3 నిమిషాలు 30 సెకన్ల పొడవుతో ఈ ట్రైలర్ విడుదల చేయడం విశేషం. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్లలో ఇది అత్యంత నిడివి గల ట్రైలర్ అని ట్రాక్.
“Endhi Ra Mi Badha” 🥵🥵🔥🔥🔥
Ah Swag Endhi #Prabhas Anna 💥⚡ #RajaSaab #RajasaabTrailer pic.twitter.com/cL3KealVS9— PALNADU YSRCP ⚠️ (@pb_ysj_Trends) September 29, 2025
చాలా కాలం తర్వాత ప్రభాస్ హారర్-కామెడీ జానర్‌లో కనిపించడం సినిమా పై అంచనాలను భారీగా పెంచింది. ఫ్యాన్స్ ఆసక్తిగా సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. ముందుగా ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్ట్‌పోన్ చేయబడింది.
డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాల కుట్టి మాళవిక మోహన్, నిధి ఆగర్వాల్, రిద్ది కుమార్ ఫీమెల్ లీడ్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం తమన్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నీ కలయికతో ‘రాజాసాబ్’ రూపొందుతోంది. సలార్, కల్కి వంటి భారీ యాక్షన్ సీక్వెల్స్ మధ్య, మంచి కామెడీ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు డార్లింగ్ ప్రభాస్.