Raj Tarun: హీరో రాజ్ తరుణ్‌కు బిగ్ షాక్.. మాజీ ప్రేయసి లావణ్య మరో కేసు నమోదు

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. అతని మాజీ ప్రేయసి లావణ్య తాజాగా నర్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా ఫిర్యాదు నమోదు చేసింది. జూన్ 30న రాజ్ తరుణ్, అతని స్నేహితులు కలిసి తనను, తన కుటుంబ సభ్యులను బెదిరించారని, బంగారం దొంగిలించారని ఆమె ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక లావణ్య ఫిర్యాదులో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. తన తండ్రిని అడ్డుకున్న వారిపై దాడి చేశారని, తన పెంపుడు కుక్కను కూడా చంపేశారని ఆమె పేర్కొంది. ఈ ఫిర్యాదు మొదట హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో, ఆయన ఆదేశాల మేరకు నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

గతంలోనూ రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారం పెద్ద వివాదమే అయ్యింది. 11 ఏళ్లపాటు తనతో రిలేషన్‌లో ఉన్న రాజ్ తరుణ్ చివరికి మోసం చేశాడని లావణ్య ఆరోపించిన విషయం తెలిసిందే. తాను శారీరకంగానూ, మానసికంగానూ బాధపెట్టాడని, గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. మరో నటి మాల్వి మల్హోత్రాతో సంబంధం పెట్టుకుని తనను వదిలేశాడని గతంలో లావణ్య రచ్చరచ్చ చేసింది.

అయితే ఈ ఆరోపణలన్నింటినీ రాజ్ తరుణ్ ఖండించాడు. లావణ్య చెప్పేవన్నీ కల్పితమేనని, తన పేరు, ప్రతిష్ట దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తోందని అన్నాడు. వ్యక్తిగత కారణాల వల్లే తమ మధ్య విభేదాలు వచ్చాయని, తప్పుడు ఆరోపణలతో కేసులు పెడుతున్నారని రాజ్ తరుణ్ గతంలోనే స్పష్టం చేశాడు.

ఇక తాజాగా వచ్చిన ఈ కేసు తర్వాత రాజ్ తరుణ్ ఇంటి వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అతని తల్లిదండ్రులు, లావణ్య మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఆస్తి వివాదాలు, బెదిరింపులు, వ్యక్తిగత ఆరోపణలు ఇలా ఈ వ్యవహారం ఇంకా ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

Leave a Reply