Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఫిక్స్..? హైదరాబాద్ బిజినెస్‌మెన్ కుమార్తెతో వివాహం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వివాహం ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్న ఫ్యాన్స్‌ను వేధిస్తున్న మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. బాహుబలి సినిమా తర్వాత ఆయన పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ ఆశించారు. కానీ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ అయిపోతూ వచ్చారు. దీంతో ఫ్యాన్స్ “ఇక ప్రభాస్ పెళ్లి కనీసం ఈ జన్మలో జరుగుతుందా?” అంటూ ఆలోచనలో పడ్డారు.

అయితే, తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈసారి నేషనల్ మీడియాలో ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ప్రభాస్ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనట్లు, ఈ కార్యక్రమాన్ని ప్రభాస్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు ప్రభాస్ పెళ్లిపై అనేక రూమర్స్ వచ్చాయి. గతంలో స్టార్ హీరోయిన్ అనుష్కతో ఆయన వివాహం ఖరారైనట్లు వార్తలు వచ్చాయి, కానీ అవి కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి. ఈసారి మాత్రం వార్త నిజమేనని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే, ప్రభాస్ ప్రస్తుతం సలార్ 2, స్పిరిట్, ఫౌజీ, ది రాజాసాబ్, కల్కి 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదనంగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ ఉంది. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌తో ప్రభాస్ ఓ మూవీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి, ప్రభాస్ పెళ్లిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply