ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. జూన్ 16న ఉదయం 10:52 గంటలకు టీజర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
అయితే టీజర్ విడుదలకు ముందే లీకుల కలకలం మొదలయింది. ఈ టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అవడంతో, చిత్ర యూనిట్ స్పందించింది. లీక్ అయిన వీడియోలు, ఫోటోలను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Strict action will be taken and handles will be suspended immediately if any leaked content from #TheRajaSaab is found….
We request everyone to cooperate and stand with us in protecting the experience….
Let’s celebrate responsibly. Be aware. ⚠️
— The RajaSaab (@rajasaabmovie) June 13, 2025
ఇలాంటి అనధికారిక కంటెంట్‌ను షేర్ చేసిన వారి సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయించేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. “సినిమాటిక్ అనుభూతిని ఇవ్వడంలో ఎంతో శ్రమపడి రూపొందిస్తున్నాం. అందరూ సహకరించాలి” అంటూ విజ్ఞప్తి చేసింది.
Likes retweets anakunda direct ga evari daggara video undho pampandi ra babu follow kodtha
Looks 🔥🔥🔥🔥🔥 #TheRajaSaab #TheRajaSaabOnDec5th#TheRajaSaabTeaserOnJune16 #Prabhas pic.twitter.com/NVYxqb1O1c
— The RajaSaab (@thesaipraveen) June 13, 2025
ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని థమన్ అందిస్తున్నాడు.