Prabhas: ప్రభాస్ ఎంట్రీతో ‘కన్నప్ప’, వాయిస్ ఓవర్‌తో ‘మిరాయ్’.. రెబల్ స్టార్ బూస్ట్ ఇచ్చాడా?

ఒక సినిమా హిట్ అవ్వడానికి హీరో పాత్ర ఎంత ముఖ్యమో, కొన్ని సందర్భాల్లో గెస్ట్ రోల్‌లో కేవలం కొన్ని నిమిషాలపాటు కనిపించే స్టార్ హీరోలు కూడా మరింత ఇంపాక్ట్ కలిగిస్తారు. ఇటువంటి ట్రెండ్ టాలీవుడ్, కోలీవుడ్‌లో ఇప్పటికే మనం చూశాం.

ఉదాహరణకు విక్రమ్ సినిమాలో చివర్లో సూర్య చేసిన రోలెక్స్ పాత్ర గుర్తుండిపోయేలా చేసింది. కేవలం పది నిమిషాల్లోనే అతని నటన ప్రేక్షకులను షాక్‌కి గురిచేసింది. అదే తరహాలో మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తనదైన శైలిలో రెండు సినిమాలకు ప్రత్యేకంగా సహకరించారు.

‘కన్నప్ప’లో ప్రభాస్ ఎంట్రీ
మంచు విష్ణు, మోహన్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం కన్నప్పలో ప్రభాస్ కీలక పాత్ర చేశాడనే వార్త వెలుగులోకి రాగానే సినిమా మీద విపరీతమైన క్రేజ్ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే సినిమా ఓపెనింగ్స్ మంచు విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌గా నిలిచాయి. థియేటర్‌లో ప్రభాస్ ఎంట్రీకి అభిమానులు ఊగిపోయారు. అతని సన్నివేశాలు విజువల్ ట్రీట్‌గా మారాయి. సినిమా మొదటి రోజునుంచే మంచి వసూళ్లు రావడంలో ప్రభాస్ పాత్ర కీలకం అయ్యింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఉన్న ప్రభాస్ ప్రభావం వల్ల బిజినెస్ పరంగా కూడా సినిమాకు పెద్ద లాభం వచ్చింది.

‘మిరాయ్’కు ప్రభాస్ వాయిస్ ఓవర్
సెప్టెంబర్ 12న విడుదలైన మరో పాన్ ఇండియా మూవీ మిరాయ్ లో ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. తేజా సజ్జా, మంచు మనోజ్ నటించిన ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ వినిపించడం అందరికి సర్ప్రైజ్‌గా మారింది. ఈ విషయం విడుదలకు ముందు వరకు సీక్రెట్‌గా ఉంచిన సినిమా యూనిట్, రిలీజ్‌కు కొన్ని గంటల ముందు అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా మిరాయ్పై హైప్ పెరిగిపోయింది. అభిమానులు ప్రభాస్ వాయిస్ వినడం కోసం థియేటర్లకు తరలివెళ్లారు.

ప్రభాస్ ఎఫెక్ట్
ఇలా వరుసగా రెండు సినిమాలకు ప్రభాస్ సహకరించడం ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్ సృష్టించింది. ప్రధాన పాత్రలో కనిపించకపోయినా, అతని ప్రెజెన్స్ సినిమాల క్రేజ్‌ను రెట్టింపు చేస్తోంది. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

మొత్తం మీద రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయినప్పటికీ, అతని గెస్ట్ అప్పియరెన్స్‌లు, వాయిస్ ఓవర్‌లు సినిమాలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి మెగా సర్ప్రైజ్‌లు ఇస్తాడో చూడాలి.

Leave a Reply