Baahubali:”దశాబ్దం తర్వాత బాహుబలి తిరిగి వస్తున్నాడు.. మరోసారి బాక్సాఫీస్‌ దద్దరిల్లిపోనుంది!”

ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో రీ-రిజిలీజ్‌ల జోరు బాగా పెరిగిపోయింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు వచ్చిన అపూర్వ ఆదరణ, ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’కు వచ్చిన సెన్సేషనల్ బుకింగ్స్ దీనికి నిదర్శనం. ఇప్పుడు ఈ ట్రెండ్‌ను మరో మెట్టుపైకి తీసుకెళ్లేందుకు ఇండియన్ సినిమా చరిత్రను మలిచిన మాస్టర్‌పీస్ ‘బాహుబలి: ది బిగినింగ్’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి – ది బిగినింగ్’ రీ-రిజిలీజ్ కానుంది. జూలై 2025లో ఈ సినిమాను తిరిగి థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాత శోభు యార్లగడ్డ అధికారికంగా ప్రకటించారు. ఖచ్చితమైన విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు కానీ, ఈ వార్త వినగానే సినీ అభిమానుల్లో ఆనందం అలరించాడు.

ఈ సినిమా మొదట 2015లో విడుదలైనప్పుడు భారతీయ సినిమా స్థాయిని మార్చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో టాలీవుడ్ స్థాయిని పెంచి, భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. ఇప్పటికీ ‘బాహుబలి’ అనే పేరు వినగానే గూస్‌బంప్స్ రావడం విశేషం!

ఈ సినిమా మళ్లీ థియేటర్లలో విడుదల అవుతుందన్న వార్తతోనే అభిమానుల్లో అంచనాలు పీక్‌కి చేరాయి. అప్పట్లో చిన్నవారిగా ఉన్న ప్రేక్షకులు ఇప్పుడు పెద్దవాళ్లై, పెద్ద తెర మీద ‘బాహుబలి’ను అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నారు. భారీ విజువల్స్, పవర్‌ఫుల్ బీజీఎమ్, అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్సెస్ – ఇవన్నీ మళ్లీ అనుభవించేందుకు థియేటర్లు సిద్ధమవుతున్నాయి.

‘బాహుబలి – ది బిగినింగ్’ విడుదలైనప్పుడు ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. ఇప్పుడు రీ-రిజిలీజ్‌లో అదే మ్యాజిక్‌ మరోసారి రిపీట్ అవుతుందా? అనే ఆసక్తి అందరిలో ఉంది. గతంలో వచ్చిన రీ-రిజిలీజ్‌ల వసూళ్లను చూసుకుంటే, ‘బాహుబలి’ ఏ స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

బాహుబలి OTTలో ఎన్ని సార్లు చూసినా, TVలో ఎన్ని రిపీట్‌ టెలికాస్టులు వచ్చినా, థియేటర్లో చూసే అనుభూతి వేరు. IMAX, 4K రీమాస్టర్‌ వెర్షన్‌, Dolby Atmos ఆడియో – ఇవన్నీ మళ్లీ థియేటర్లో పూనకాలు తెప్పిస్తాయి.

రెడీ అవ్వండి! బాహుబలి మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వస్తున్నాడు. ఈసారి రికార్డులు ఎలా ఉంటాయో చూడాలి!

Leave a Reply