ఓ పక్క టీవీలో ఫ్యామిలీ డ్రామాలు, మరోపక్క థ్రిల్లర్స్ కి అలవాటుపడ్డ ప్రేక్షకులకు ‘పెరుసు’ అనే సినిమా మాత్రం పూర్తిగా డిఫరెంట్ టేస్ట్ ఇచ్చేలా ఉంది. అడల్ట్ హ్యూమర్‌తో నిండి, ఓ చిన్న గ్రామంలో ఒక కుటుంబం ఎదుర్కొనే విచిత్ర పరిస్థితులను నవ్వుల మాదిరిగా తెరకెక్కించిన ఈ తమిళ డబ్ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
మార్చి 14న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. హీరో వైభవ్ రెడ్డి, ఆయన సోదరుడు సునీల్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం, వారి తండ్రి కోదండరామిరెడ్డి సినిమాలకి బిన్నంగా నిలిచింది.
గ్రామంలో అందరి గౌరవం పొందిన పరంధామయ్య అనే పెద్దాయన ఓ రోజు ఆకస్మికంగా చనిపోతాడు. అయితే, ఒక వివాదాస్పద కారణంతో ఆయన మరణాన్ని ఇంట్లో వాళ్లు బయటకు చెప్పలేరు. గ్రామ పరువు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇంట్లోనే రహస్యంగా అంత్యక్రియలు చేయాలనుకుంటారు. కానీ ఆ ఒక్క నిర్ణయం వల్ల కుటుంబం ఎన్నో విచిత్ర, హాస్యభరితమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది.
ఫ్యామిలీ డామినేటెడ్ సబ్జెక్ట్ అయినా ఇది ఫ్యామిలీతో చూడదగిన సినిమా కాదు! కారణం – సినిమా మొత్తం అడల్ట్ హాస్యంతో నిండి ఉంది. కొన్ని సందర్భాల్లో బోల్డ్ డైలాగ్స్, సంభాషణలు ఉండడంతో, ఓపెన్ మైండెడ్ ఫ్రెండ్స్‌తో చూస్తేనే అసలైన ఎంజాయ్‌మెంట్.
వైభవ్ రెడ్డి, సునీల్ రెడ్డి మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇది కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు ఓ క్లియర్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కనిపిస్తుంది.
మొత్తం మీద, బోల్డ్ కాన్సెప్ట్, సింపుల్ స్టోరీ, హాస్యంతో నిండి ఉండే స్క్రీన్‌ప్లే ఈ సినిమాను ఓ డిఫరెంట్ వాచ్‌గా నిలబెడతాయి. ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్‌తో ఓ అడల్ట్ కామెడీ మూవీ చూసే ప్లాన్‌లో ఉంటే ‘పెరుసు’ ఓ కరెక్ట్ మూవీ అని చెప్పొచ్చు.