రిలీజ్‌కి ముందే రికార్డు క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఒక్క టికెట్ రూ.5 లక్షలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా రిలీజ్‌కి ముందే రికార్డులు సృష్టించడం ప్రారంభించింది. అమెరికాలో ఓజీ టికెట్ ఒకటి ఏకంగా రూ.5 లక్షలకు అమ్ముడవడం ఇండస్ట్రీలో సంచలనం రేపింది. సినిమా ఫస్ట్ టికెట్‌ను వేలం వేయగా, టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా రూ.5 లక్షలకు దక్కించుకుంది. వారు ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా అందజేశారు.

సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. గ్యాంగ్‌స్టర్ షేడ్‌లో పవన్ లుక్‌కి ఫ్యాన్స్ ఇప్పటికే ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించబోతుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.

ఈ ప్రత్యేక ఆన్‌లైన్ వేలం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నిర్వహించారు. అభిమానులు చెప్పిన ప్రకారం, ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా నార్త్ అమెరికా అభిమానుల బృందం విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘ఓజీ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ప్రీ-రిలీజ్ టికెట్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. ఇప్పటికే $1 మిలియన్ ప్రీ-సేల్స్ మార్కును దాటిన తొలి తెలుగు చిత్రంగా ఓజీ నిలిచింది.

Leave a Reply