పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు భారీ ప్రాజెక్టులు.. హరిహర వీరమల్లు మరియు OG సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లో OGపై జరుగుతున్న బిజినెస్ మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, OG సినిమా ఏపీలో ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా బిజినెస్ దాదాపు ఖరారయ్యిందట. ఇంకా సినిమా రిలీజ్ డేట్ ఖరారు కాలేదు, కానీ ఎప్పుడైనా థియేటర్లలోకి వచ్చినా చూసేందుకు జనాలు రెడీగా ఉన్నారు. ఈ స్థాయి హైప్ వల్లే బిజినెస్ ఏ రేంజ్లో జరుగుతోందో చూడచ్చు.
ఇదే సమయంలో, హరిహర వీరమల్లు రిలీజ్ OG కంటే ముందే జరుగనున్నప్పటికీ, OG బిజినెస్ మాత్రం మరింత ఎక్కువగా జరుగుతోంది. ఇదే పవన్ కల్యాణ్ మార్కెట్‌కి నిదర్శనం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఒటిటి, శాటిలైట్, ఇతర ప్రాంతీయ రైట్స్ అన్నీ కలిపి OG మొత్తం బిజినెస్ రూ.250 కోట్లను కూడా దాటే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్. ఇక హరిహర వీరమల్లు నిర్మాత కూడా ఏపీలో మాత్రమే దాదాపు రూ.100 కోట్ల మేర డీల్ ఫైనల్ చేశారని సమాచారం.
ఈ డీటెయిల్స్ చూసిన పవన్ ఫ్యాన్స్ జోష్‌లో ఉన్నారు. రిలీజ్ కాకముందే ఇలా బిజినెస్ జరగడం పవన్ క్రేజ్‌కు నిదర్శనం. ఇక ఒకవేళ ఈ సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు.
ఇప్పటివరకు అధికారికంగా రిలీజ్ డేట్స్ ప్రకటన వెలువడకపోయినా, రెండు సినిమాలకూ క్రేజ్ తారాస్థాయికి చేరింది. మరి OG, హరిహర వీరమల్లు సినిమాలు ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తాయో వేచి చూడాలి.