పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక అదిరిపోయే అప్‌డేట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందం మూడింతలు అయింది.
థమన్ తెలిపిన వివరాల ప్రకారం, ‘ఓజీ’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం జపాన్‌కు చెందిన ప్రత్యేక వాయిద్య పరికరం ‘కోటా’ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం లండన్‌లోని స్టూడియోలో రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయని, BGM అద్భుతంగా వస్తోందని చెప్పారు. ముఖ్యంగా ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఏకంగా 117 మంది సంగీతకారులు కలిసి పనిచేస్తున్నారని థమన్ వెల్లడించారు. ఈ అప్‌డేట్‌ను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో పవన్ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది.
#HungryCheetah 🐆 Was Sounding So Gigantic 🖤
From @AbbeyRoad With 117 Futuristic Musicians 🥹#OgBGM ❤️ pic.twitter.com/06ffXhNekY— thaman S (@MusicThaman) September 8, 2025
ఇప్పటికే ‘ఓజీ’ నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు #HungryCheetah మరియు సువ్వి.. సువ్వి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా #HungryCheetah పాటలో థమన్ ఇచ్చిన పవర్‌ఫుల్ బీట్స్, ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.