ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్.. సినీ రంగంలో పవర్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం ఆయన నుండి హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు రావాల్సి ఉన్నాయి. అయితే రాజకీయాలతో బిజీగా ఉండటంవల్ల సినిమాలకు తగిన కాల్షీట్లు ఇవ్వలేకపోతున్నారు. కష్టపడి పూర్తి చేసిన హరిహర వీరమల్లు సినిమా మే 9 న విడుదల కానుంది.
సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరకు ఎన్నో కథలు వచ్చాయి. కానీ చాలా కథలను ఆయన తిరస్కరించారు. ఇవి తర్వాత బ్లాక్‌బస్టర్‌లుగా మారాయి. ఉదాహరణకి, పూరీ జగన్నాథ్ మొదట ‘బద్రి’తో పవన్‌ను పరిచయం చేసిన తర్వాత, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి కథలను వినిపించారు. పవన్ చేస్తానంటే ఇవన్నీ ఆయనకే ఉండేవి. కానీ ఆయన నో చెప్పడంతో రవితేజతో ఈ సినిమాలు తీసి.. ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్స్ అయ్యాయి.
తర్వాత కూడా పూరీ జగన్నాథ్ పోకిరి కథను పవన్ కళ్యాణ్ కు చెప్పగా అదికూడా ఓకే చెప్పలేదు. ఈ సినిమాను మహేష్ బాబు తో తీసి ఇండస్ట్రీ హిట్ గా నిలిపాడు. అంతే కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు కథను కూడా మొదట పవన్‌కే వినిపించారు. కానీ కథ వినే సమయంలో ఆయన నిద్రపోయినట్టు త్రివిక్రమ్ ఒక ఫంక్షన్లో చెప్పారు. ఆ కథను మహేష్ బాబుతో తెరకెక్కించి ఒక క్లాసిక్ హిట్‌గా నిలిపారు.
దిల్ రాజు నిర్మించిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మొదట పవన్‌కే వినిపించారు. ఆయన తిరస్కరించడంతో వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. అలాగే హరీష్ శంకర్ రూపొందించిన మిరపకాయ్ కూడా మొదట పవన్ కళ్యాణ్ చేతికి వచ్చింది. కానీ ఆయన అంగీకరించలేదు. రవితేజతో తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు.
ఇన్ని మిస్ అయిన సినిమాలను గుర్తు చేసుకుంటూ.. “ఇవన్నీ మన పవన్ చేసుంటే ఇంకెంతో బాగుండేది కదా” అంటూ మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.