HariHara VeeraMallu: ఇది కదా పవర్ స్టార్ మేనియా.. ప్రీమియర్స్‌తోనే రికార్డు కలెక్షన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏడేళ్ల తర్వాత ఒరిజినల్ కథతో హరిహర వీరమల్లుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రెండేళ్ల తర్వాత థియేటర్లో కనిపించబోతున్న పవన్, రాజకీయాల్లో హైప్ ఉన్న టైంలో రావడం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చింది. మొదట ఈ సినిమా మీద అంత ఆసక్తి ఉండదని విమర్శించినవాళ్లు, ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ చూసి షాక్ అవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌కి పర్మిషన్స్ రావడంతో నేడు రాత్రి 9.30 నుంచే షోలు స్టార్ట్ అవుతున్నాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతూ, చాలా థియేటర్లు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. వచ్చే మూడు రోజులకు కూడా కొన్ని థియేటర్లలో టికెట్లు దాదాపు సేల్ అవ్వడంతో పవన్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.

ప్రీమియర్స్, అడ్వాన్స్ సేల్స్‌తోనే దాదాపు ₹30 కోట్ల గ్రాస్ వచ్చిందని బాక్సాఫీస్ టాక్. బుక్ మై షోలో గంటకు 15 వేల టికెట్లు సేల్ అవుతుండటంతో ఇదే పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్ అని అభిమానులు గర్వపడుతున్నారు. స్టార్‌డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎందుకు పవన్ పేరు వింటేనే ఓపెనింగ్స్ హామీగా వస్తాయని చెబుతారో, ఇప్పుడు మరోసారి రుజువైంది. ఈ లెక్కన హరిహర వీరమల్లు భారీ లాభాలు రాబట్టడం ఖాయం అని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

Leave a Reply