Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ చూసేశాడు.. త్రివిక్రమ్ సర్‌ప్రైజ్ గెస్ట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’ ప్రేక్షకుల ముందుకు రానున్న తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ల వేగం పెరుగుతోంది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది.

ఇటీవల చిత్ర యూనిట్ జూలై 3న ఉదయం 11:10 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతకముందే ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూసినట్లు సమాచారం. పక్కన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నాడు.. ట్రైలర్‌ను వీరిద్దరూ కలిసి ఆసక్తిగా చూశారు. తర్వాత పవన్, దర్శకుడు జ్యోతికృష్ణను ప్రశంసించినట్లు చిత్రబృందం ఓ వీడియో ద్వారా వెల్లడించింది.

ఈ సినిమాలో మొదట దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply