పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ భారీ అంచనాల మధ్య జూలై 24న విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. ఏఎం రత్నం నిర్మాణంలో, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఐదేళ్లుగా తెరకెక్కిన ఈ పీరియాడిక్ ఫిక్షనల్ మూవీ, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ పొందింది. విజయోత్సాహంలో భాగంగా, చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
అయితే ఈ సక్సెస్ మీట్లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పవన్ ఫ్యాన్ అయిన ఓ నటి స్టేజ్‌పైకి వెళ్లి పవన్ కళ్యాణ్ కాళ్లు మెక్కి, ఆయన చేతిని గట్టిగా పట్టుకుని ఫోటోలు దిగింది. ఆ ఆనందంలో గెంతులేసింది కూడా. ఆమె ఈ చర్యలతో పవన్ కూడా కొంచెం సిగ్గుపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో “ఎవరు ఈ అమ్మాయి?” అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తాగి పడేసిన వాటర్ బాటిల్ దాచుకున్న
పవన్ తో ఒక సినిమా చేసి చనిపోయినా చాలు – నివితా మనోజ్ pic.twitter.com/Ib3ZjZBpzm— Anitha Reddy (@Anithareddyatp) July 26, 2025
ఆమె పేరు నివితా మనోజ్. హరిహర వీరమల్లు సినిమాలో ఒక చిన్న రోల్లో కనిపించింది. నటిగా మారకముందు టీవీ యాంకర్‌గా పనిచేసి, పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసింది. పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అయిన నివితా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. సక్సెస్ మీట్లో పవన్ ఆమెను ప్రత్యేకంగా ప్రస్తావించడంతో, ఆమె ఫాలోవర్లు ఒక్కసారిగా పెరిగిపోయారు. ఆసక్తికరంగా, నివితాకు ఇప్పటికే పెళ్లి కాగా, ఓ కూతురు కూడా ఉంది.
మిశ్రమ స్పందన
సినిమా విషయానికి వస్తే.. ‘హరిహర వీరమల్లు’ 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ. పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే యోధుడి పాత్రలో నటించారు. అణగారిన ప్రజలలో ఆశ నింపడానికి, విలువైన కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే సాహసోపేత మిషన్నే కథగా చూపించారు.
విడుదలైన తొలి రోజు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్లు బాగున్నాయని కొందరు ప్రశంసించగా, కథనం, వీఎఫ్ఎక్స్ నాణ్యత నిరాశపరిచిందని మరికొందరు పేర్కొన్నారు.
ఈ సినిమా ‘హరిహర వీరమల్లు పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కాగా, క్లైమాక్స్‌లో దీని సీక్వెల్ ‘హరిహర వీరమల్లు పార్ట్ 2 – బ్యాటిల్‌ఫీల్డ్’ టైటిల్‌ను కూడా ప్రకటించారు. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియోకు వెళ్లాయని, ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ కావచ్చని సమాచారం.