బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమె భర్త ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ జంట తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ షేర్ చేస్తూ ఈ శుభవార్త అందించారు. “మా చిన్న ప్రపంచం వస్తోంది” అని క్యాప్షన్‌లో రాశారు.
ప్రకటనతో పాటు, వారు ఒక అందమైన వీడియో, ఫోటోను షేర్ చేశారు. ఫోటోలో “1 + 1 = 3” అనే అక్షరాలతో ఉన్న కేక్, చిన్న పాదాల ముద్రలు ఆకట్టుకున్నాయి. వీడియోలో ఈ జంట ప్రకృతి మధ్యలో చేతులు పట్టుకుని నడుస్తున్న సన్నివేశం ఉంది. ఈ శుభవార్త వెలువడగానే సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
View this post on Instagram
పరిణీతి చోప్రా – రాఘవ్ చద్దా 2023 సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు.
పరిణీతి 1988 మే 21న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. ఆమె బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాకు కజిన్. లండన్ మ్యాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్, ఫైనాన్స్, ఎకనామిక్స్‌లో ట్రిపుల్ హానర్స్ డిగ్రీ సాధించారు. లండన్‌లో ఫైనాన్స్ రంగంలో పనిచేసిన తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకుని 2011లో “లేడీస్ వర్సెస్ రికీ బెహ్ల్” సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో నటనకు మంచి గుర్తింపు రావడంతో ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు.
అభినయం మాత్రమే కాకుండా, పరిణీతి మంచి గాయని కూడా. ఆమె “మెరిస ప్యారీ బిందు” సినిమాలో “మాన కే హమ్ యార్ నహీ” అనే పాటను పాడి హిట్ సాధించారు.