జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, పాకిస్తానీ నటీనటులతో రూపొందించిన సినిమాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత చెలరేగుతోంది. పాక్పై పెరుగుతున్న ఆగ్రహానికి నిదర్శనంగా, సోషల్ మీడియాలో “పాక్ యాక్టర్ల సినిమాలకు నో ఎంట్రీ” అనే ఉద్యమం ఊపందుకుంది. ఇదే క్రమంలో పాక్ నటుడు ఫహద్ ఖాన్ నటించిన ‘అభిర్ గులాల్’ సినిమాపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సినిమా మే 9న విడుదల కానుంది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్తి ఎస్ బాగ్డీ దర్శకురాలు. కథానాయికగా వాణి కపూర్ నటిస్తున్నారు. అయితే హీరోగా పాకిస్తాన్కు చెందిన ఫహద్ ఖాన్ నటించడం వల్ల ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కూడా ఈ చిత్రం విడుదలపై అనుమతి నిరాకరించినట్లు సమాచారం వెలువడింది.
Film Abir Gulaal blocked by MIB. The Film Federation also denied the release of this film.
Why, now?
Not because the lead actor is a Pakistani.
Because we needed one terrorist attack to remind us that the lead actor is a Pakistani. pic.twitter.com/9kJ8J9q3Dr
— The Hawk Eye (@thehawkeyex) April 24, 2025
అయితే, తాజాగా యూట్యూబ్ ఇండియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ‘అభిర్ గులాల్’ సినిమాకు సంబంధించిన పాటలను భారతదేశంలో తమ ప్లాట్ఫామ్ నుంచి తొలగించింది. ఈ సినిమాలో రెండు పాటలు ముందే యూట్యూబ్లో విడుదలై, మంచి వ్యూస్ రాబట్టాయి. వాటిలో ఒకటి రొమాంటిక్ ట్రాక్ కాగా, మరొకటి ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్. కానీ ఇప్పుడు ఈ రెండు పాటలు భారత్ లో చూడటానికి వీలు లేకుండా చేశారు.
యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చిత్రబృందానికి పెద్ద దెబ్బే తగిలింది. ఇప్పటికే సినిమా విడుదలపై కేంద్రం క్లారిటీ ఇవ్వకపోతే, ఇప్పుడు యూట్యూబ్ షాక్ కూడా ఆడిషనల్గా వరుస దెబ్బలుగా మారాయి.
గమనించదగ్గ విషయం ఏంటంటే… కొన్ని నెలల క్రితమే పాక్లో రూపొందిన ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ సినిమా భారతదేశంలో విడుదలై మంచి స్పందన పొందింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత ప్రేక్షకులు పాక్ నటీనటులకు గట్టి షాక్ ఇచ్చేలా కనపడుతున్నారు.