పాడుతా తీయగా షోపై ప్రవస్థి షాకింగ్ కామెంట్స్.. బాడీ షేమింగ్, ఎక్స్‌పోజింగ్ ఆరోపణలు!

తెలుగు బుల్లితెరపై ఎంతో ప్రత్యేకత సంపాదించుకున్న ‘పాడుతా తీయగా’ షోపై ఓ షాకింగ్ ఆరోపణ బయటపడింది. ఈటీవీ ప్రసారం చేస్తున్న ఈ ప్రఖ్యాత మ్యూజికల్ షోపై తాజాగా ప్రముఖ గాయని ప్రవస్థి సంచలన వ్యాఖ్యలు చేశారు. షోలో పాల్గొన్న ఆమె ఇటీవలే ఎలిమినేట్ అయ్యారు. అనంతరం ఆమె యూట్యూబ్‌లో ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసి, షో జడ్జీలపై, ప్రొడక్షన్ టీమ్‌పై గంభీర ఆరోపణలు చేశారు.

“నన్ను బలవంతంగా ఎక్స్‌పోజింగ్ చేయమన్నారు. చీరను బొడ్డు కింద కట్టుకోవాలని చెప్పారు. ప్రొడక్షన్ టీమ్ నన్ను అటూ ఇటూ తిప్పుతూ మెంటల్‌గా చాలా డిప్రెషన్‌కి నెట్టారు. బాడీ షేమింగ్ చెయ్యడంతోపాటు, ‘ఇలాంటి బాడీకి ఏం బట్టలు వేయాలో?’ అంటూ కాస్ట్యూమ్ డిజైనర్ కామెంట్స్ చేశారు.”

జడ్జీలపై తీవ్ర విమర్శలు

ఈ షోలో జడ్జీలుగా ఉన్న కీరవాణి, సునీత, చంద్రబోస్ లపై కూడా ప్రవస్థి తీవ్ర ఆరోపణలు చేశారు.

“సునీత గారు స్టేజ్ మీదకు రాగానే అసహ్యంగా చూసేవారు. కీరవాణి గారు తమ పాటలు పాడితేనే మంచి మార్కులు ఇస్తారు. నేను పాట మర్చిపోకపోయినా నెగిటివ్ పాయింట్స్ చూపారు. చంద్రబోస్ గారు కూడా అవసరం లేని తప్పులపై మాట్లాడారు.”

“వెడ్డింగ్ షోలు చేశానని నాకు అవమానంగా ట్రీట్ చేశారు. గిఫ్ట్స్, డబ్బులు ఇవ్వలేను కాబట్టి ఛాన్స్‌లు ఇవ్వలేదని అనిపించింది.”

ఎస్పీబీ లేకుండా వచ్చిన మార్పులు

“2017లో భాగమైన సీజన్ వరకు చాలా బాగుండేది. కానీ జ్ఞాపిక ప్రొడక్షన్స్ హ్యాండిల్ చేసిన తర్వాతే పరిస్థితి మారింది. ఇప్పుడు మ్యూజిక్ కంటే కామెడీ, డ్యాన్సులు, ఎంటర్టైన్మెంట్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంది.”

“డ్యాన్స్ చేయమని బలవంతం పెట్టారు. జడ్జీలు నన్ను పనికిరాని వ్యక్తిగా ట్రీట్ చేశారు. ఇలా ఎక్కడా చూడలేదు. ఎస్పీ బాలు సర్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు.”

వీడియో చివర్లో తీవ్ర వ్యాఖ్యలు..

“నేను మ్యూజిక్ ఫీల్డ్ వదిలిపెట్టాలని డిసైడ్ అయ్యాను. నా మీద, నా కుటుంబంపై ఏమైనా జరిగినా ఇందుకు కారణం సునీత, కీరవాణి, చంద్రబోస్, జ్ఞాపిక ప్రొడక్షన్ అనిల్” అంటూ పేర్కొన్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాడుతా తీయగా జడ్జీలు లేదా ప్రొడక్షన్ హౌస్ దీనిపై స్పందిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply