పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఎదురుచూపుల మధ్య, ‘OG’ చిత్రం ట్రైలర్ చివరికి యూట్యూబ్‌లో విడుదలైంది. ప్రారంభంలో చిత్ర బృందం ట్రైలర్‌ను ఆన్‌లైన్‌కి కాకుండా, హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో(OG Pre Release Event) అభిమానుల ముందు ప్రదర్శించడంతో కొంత మంది నిరాశపడ్డారు. కానీ ఈ మధ్యాహ్నం ట్రైలర్ యూట్యూబ్‌లో రిలీజ్ చేయబడింది.
సోషల్ మీడియాలో ఇప్పటికే ‘OG’ ట్రైలర్ సంబంధిత లీక్ అయిన క్లిప్‌లు, ఫోన్ రికార్డింగ్‌లు వైరల్ అయ్యాయి. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో రాణించాడు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు, పవన్ పవర్ ఫుల్ డైలాగ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు సుజీత్ పవన్‌ను కొత్త కోణంలో చూపించారని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
#OG is ready to give you all a JOLT ⚡️ ⚡️https://t.co/E0h012DXTB#OGTrailer #TheyCallHimOG pic.twitter.com/mGoeXELAnB
— DVV Entertainment (@DVVMovies) September 22, 2025
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో, ప్రియాంక మోహన్ కథానాయికగా నటించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. తమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.