OG సినిమా షూటింగ్ కోసం ముంబై వీధుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేశారు. పవన్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో కనిపించిన పవన్ ఈ వీడియోతో మళ్లీ సినిమాపై భారీ అంచనాలు రేపారు. పవన్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఊహించని రీతిలో రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతోనూ, రాజకీయాలతోనూ సూపర్ బిజీ. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్ కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ OG పనులు తుది దశకు చేరుకున్నాయి.
OG చిత్రంలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఓ పవర్‌ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నారని టాక్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రత్యేకించి ‘‘అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే’’ అనే సాంగ్ ఫ్యాన్స్‌లో క్రేజ్‌ను పెంచింది.
#viralvideo#Mumbai లో #OG షూటింగ్#OG షూటింగ్లో పవన్ స్టన్నింగ్ లుక్ ఆకట్టుకుంటోంది.
వింటేజ్ బెల్ బాటమ్ పాయింట్ ధరించిన ఆయన లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. pic.twitter.com/e3PjZBppfB
— greatandhra (@greatandhranews) May 28, 2025
తాజాగా OG షూటింగ్ ముంబైలో జరిగింది. పవన్ లుక్ ముంబై వీధుల్లోనే షూట్ చేసిన దృశ్యాల్లో బయటపడింది. హాట్ లుక్‌లో పవన్ స్టైలిష్ యాటిట్యూడ్ చూపించి అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
పవన్ OGతో రీ ఎంట్రీ ఇస్తున్నారు అనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే తరహాలో ప్రచారం కొనసాగితే OG పవన్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం అనిపిస్తోంది.