పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘OG’ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా మూడు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చిత్రబృందానికి శుభవార్త చెప్పింది. సినిమా టికెట్ ధరలను పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చి, అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రేట్లు 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి. అదనంగా, సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు జరిగే స్పెషల్ ప్రీమియర్ షో కోసం కూడా అనుమతి ఇవ్వబడింది. ఈ షో టికెట్ ధర రూ.800 వరకు పెట్టబడింది.
తెలంగాణ లో ఓజీ టికెట్స్ రేట్స్ పెంపు..
స్పెషల్ ప్రీమియర్ షో కు పర్మిషన్.. సెప్టెంబర్ 24 రాత్రి 9గంటలకు స్పెషల్ ప్రీమియర్..
టికెట్ రేట్ 800.. 10రోజుల పాటు టికెట్ రేట్స్ పెంపు..
సింగల్ స్క్రీన్ 100.. మల్టీఫ్లెక్స్ 150.#OGonSept25 #OG #PawanKalyan pic.twitter.com/s88T9hoPFR
— Telugu Reporter (@TeluguReporter_) September 19, 2025
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మెమో ద్వారా, ఏపీలో 25వ తేదీ అర్ధరాత్రి 1 గంట నుండి రూ.1000 టికెట్ రేటుతో ప్రదర్శనలకు అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటు రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 గా నిర్ణయించారు. ఈ రేట్లు 25 సెప్టెంబర్ నుంచి 4 అక్టోబర్ వరకు అమల్లో ఉంటాయి.
‘OG’ సినిమాపై పవన్ కల్యాణ్ అభిమానుల్లో విపరీత క్రేజ్ నెలకొని ఉంది. మూవీ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టికెట్ రేట్లు పెంచడంపై పవన్ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు, సంగీతం తమన్ అందిస్తున్నారు.