పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ నుంచి పవర్‌ఫుల్ గిఫ్ట్ వచ్చింది. భారీ అంచనాల మధ్య ‘ఓజీ’ స్పెషల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఇందులో పవన్ లుక్, డైలాగ్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా విలన్‌గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ, ఆయన డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వీడియోకి మరో లెవెల్ జోడించింది.
హరిహర వీరమల్లు నిరాశ కలిగించినప్పటికీ, ‘ఓజీ’ మాత్రం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించబోతోందనే అంచనాలు ఈ గ్లింప్స్ తో మరింత పెరిగాయి. ఇమ్రాన్ హష్మీ తెలుగు తెరకు పరిచయం కావడంతో హిందీ మార్కెట్ కూడా కలిసొస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.
That’s OMI.
That’s his wish.
That’s for OG 🔥https://t.co/whC1hZSqw1#HBDOgLoveOmi#HBDPawanKalyan #OG #TheyCallHimOG pic.twitter.com/jzN8imEYzq— DVV Entertainment (@DVVMovies) September 2, 2025
భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ‘ఓజీ’ ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్‌తో ప్రమోషన్లు వేగంగా సాగుతున్నాయి. ‘సువ్వి.. సువ్వి’, ‘ఫైర్ స్ట్రోమ్’ వంటి పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించి సినిమాపై బజ్‌ని పెంచాయి.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘సువ్వి.. సువ్వి’ పాటలో పవన్-ప్రియాంక కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది. ఇందులో ప్రియాంక ‘కన్మణి’ పాత్రలో కనిపించనుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు ఎమోషనల్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉండబోతున్నాయి.