OG Nizam Record: పవన్ కళ్యాణ్ మాస్ విధ్వంసం.. నైజాం రికార్డ్ ఓపెనింగ్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి చాలాకాలం అయింది. అభిమానులు ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. అందుకు సరిపడేలా OG సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. OG (They Call Him OG)తో పవన్ మళ్లీ ఫుల్ ఫారంలో కనిపిస్తున్నారు.

OG ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్, థమన్ సంగీతం, సుజీత్ గ్యాంగ్‌స్టర్ టచ్ ఫ్యాన్స్‌ను మొత్తం హైప్‌లోకి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఏరియాల్లో ఘనంగా సాగుతున్నాయి.

నైజాం ప్రాంతం పవన్ కోసం ప్రత్యేక క్రేజ్ కలిగిన ఏరియా. OG సినిమా ఈ జోన్‌లో భారీగా ఓపెనింగ్ సాధించనుందంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం, OG ఓపెనింగ్ డే (పెయిడ్ ప్రీమియర్స్ కలుపుకొని) నైజాంలో దాదాపు రూ. 25 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టే అవకాశముందని చెబుతున్నారు.

ఇప్పటివరకు నైజాం ఓపెనింగ్ డే రికార్డు పుష్ప 2: ది రూల్ (అల్లు అర్జున్) పేరు మీద వుంది. OGకి పాజిటివ్ టాక్ వస్తే, ఆ రికార్డును బ్రేక్ చేయడం సులభమేనని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

ఈ యాక్షన్ ప్యాక్డ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. DVV దానయ్య – కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అలాగే, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

OG సినిమా నైజాం మాత్రమే కాదు, ఇతర ఏరియాల్లోనూ మంచి బిజినెస్ సాధిస్తోంది. నైజాం మార్కెట్ నుంచి భారీ వసూళ్లు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే అత్యంత భారీ ఓపెనర్‌గా నిలవటం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply