పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘OG’ తాజాగా ట్రైలర్‌తో హంగామా సృష్టిస్తోంది. కొద్దిగంటల క్రితం విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ లుక్స్, స్టైల్, పవర్ఫుల్ డైలాగ్స్ చూసిన ప్రేక్షకులు “వింటేజ్ పవన్ కళ్యాణ్ బ్యాక్” అని చెప్పిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, OG సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ (అడల్ట్స్ ఓన్లీ) మంజూరు చేసింది. అంటే 18 ఏళ్లు దాటిన వారు మాత్రమే థియేటర్లో చూడవచ్చు.
OG, A certificate.
Pure Blood Bath.Censor board said, if film wants UA certificate, they have to remove 25 scenes and some cuts of blood and violence.
But makers opted for Blood Bath and settled for A rated 18+ certificate. 🔥🔥🔥🔥.. fire fire. Wild.#TheyCallHimOG #OG pic.twitter.com/0NJghCM7gO
— Eagle Speaks (@EagleSpeaks7) September 22, 2025
ఇది పవన్ కళ్యాణ్ సినిమాల్లో “పంజా” తర్వాత రెండవ A సర్టిఫికేట్ పొందిన చిత్రం. మొదట OG చిత్రబృందం U/A సర్టిఫికేట్ కోసం ప్రయత్నించినప్పటికీ, సెన్సార్ బోర్డు కొన్ని కీలక సన్నివేశాలపై కట్స్ సూచించింది. కథలో ఉండే మాస్ ఎఫెక్ట్ తగ్గిపోతుందనే కారణంతో మేకర్స్ చివరికి A సర్టిఫికేట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
సినిమా రన్‌టైమ్:
OG మూవీకి 154 నిమిషాలు (2 గంటల 34 నిమిషాలు) రన్‌టైమ్ ఫిక్స్ అయింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోకు స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ రన్‌టైమ్ బాగా సరిపోతుంది.