OG Movie: ‘మిరాయ్’ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ సినిమా.. ఫ్యాన్స్ ఫిదా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘ఓజీ’ ఎప్పుడెప్పుడు చూడాలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో 24 గంటల్లో ఈ సినిమా అభిమానుల ఎదురుచూపులకు తెర దించనుంది. సెప్టెంబర్ 25న ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల అవుతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమై, టికెట్లు హాట్ కేక్‌లా అమ్ముడవుతున్నాయి. చాలా థియేటర్స్‌లో హౌజ్‌ఫుల్ బోర్డులు కనబడ్డాయి.

ఈ నేపథ్యంలో ‘మిరాయ్’ మూవీ నిర్మాత TG విశ్వప్రసాద్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

‘మిరాయ్’ ప్లేస్‌లో ‘ఓజీ’

సెప్టెంబర్ 25న ‘మిరాయ్’ ప్రదర్శించబడుతున్న కొన్ని థియేటర్స్‌లో ‘ఓజీ’ ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత, సెప్టెంబర్ 26 నుంచి యధావిధిగా ఆ థియేటర్స్‌లో ‘మిరాయ్’ సినిమా మాత్రమే స్క్రీనింగ్ జరగనుంది.

‘మిరాయ్’ ఈ నెల ప్రారంభంలో రిలీజ్ అవుతూ, ఒక్క వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పటికీ థియేటర్స్‌లో ఫుల్ సక్సెస్ రన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, TG విశ్వప్రసాద్ ‘మిరాయ్’ థియేటర్స్‌ను ‘ఓజీ’ కోసం కేటాయించడం పై పవన్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply