ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సినిమా గురించే చర్చ జరుగుతోంది. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ విజృంభణ వల్ల సోషల్ మీడియా హల్చల్ అయింది. చాలా కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందని, వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు.
ఇంకా ప్రత్యేకంగా, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కలిసి కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవు! జూనియర్, హృతిక్ అభిమానులు కలిసి పండగ వాతావరణం సృష్టించి, స్టేడియం కేకలు, నినాదాలతో ఊరిపోయింది.
INTERNET FILLED WITH THIS VIDEO ALREADY 💣💥💥🧨🧨 @tarak9999 @iHrithik#War2PreReleaseEvent #WAR2
pic.twitter.com/mWAo7sfMsX— Let’s X OTT GLOBAL (@LetsXOtt) August 10, 2025
ప్రతి చిన్న వీడియో, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఎన్టీఆర్, హృతిక్ కలిసి స్టేజ్‌పై ఉన్న ‘షర్ట్ కాలరెత్తిన’ వీడియో ప్రత్యేక ఆకర్షణగా మారింది. అందులో ఎన్టీఆర్ స్పీచ్ ఇచ్చి “ప్రతిసారి ఒకటే ఎత్తేవాడిని.. ఈసారి రెండు ఎత్తుతున్నాను” అంటూ మజాకుగా షర్ట్ కాలర్‌ను పైకి ఎత్తాడు.
ఎవరు ఏమన్నా, ఏమి అనుకున్నా ఈసారి బొమ్మ నిజంగా అదిరిపోయిందని ఎన్టీఆర్ ధీమాగా చెప్పారు. “పండగ చేసుకోండి” అంటూ సినిమా విజయంపై నమ్మకాన్ని వ్యక్తం చేయడంతో స్టేడియం అరుపుల, గోలలతో మారుమోగింది.