జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ ట్రిప్‌లో ఆయన వేసుకున్న ఓ పువ్వుల డిజైన్ ఉన్న బ్లూ షర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సింపుల్ గా కనిపిస్తున్న ఆ షర్ట్ ధర వింటే అభిమానులు, నెటిజన్లు నిజంగా షాక్ అవుతున్నారు.
అది ఎట్రో (Etro) అనే ఇంటర్నేషనల్ పైస్లీ డిజైనర్ బ్రాండ్‌కు చెందినది. దాని ధర రూ.65,000 నుంచి రూ.85,000 మధ్య ఉండవచ్చని అభిమానులు వెతికి మరీ చెబుతున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు వేసుకునే దుస్తులు, వాచ్‌లు, షూస్ వంటి వాటిపై అభిమానులలో ఎనలేని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో అయితే ఒక్కో ఐటమ్ ఖరీదు సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవుతుంది.
ఇప్పుడు ఎన్టీఆర్ వేసుకున్న ఈ ఫ్యాషన్ ఐటమ్ కూడా అలానే ట్రెండ్ అవుతోంది. “ఏంటి భయ్యా.. ఒక్క షర్ట్‌కే ఇంత ఖర్చా?” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “పువ్వుల షర్ట్ అయితే కానీ మన దగ్గర బజార్ లో 500కే వస్తుంది.. కానీ ఇది 85 వేలా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ స్టైల్ గా ఉండేలా చూసుకుంటాడు. స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా బ్రాండెడ్ వస్తువులను సెలెక్ట్ చేయడంలో ఎన్టీఆర్‌కి ఓ స్పెషల్ టేస్ట్ ఉంది. గతంలోనూ ఆయన ధరించిన వాచ్‌లు, సూట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ షర్ట్ విషయమై నెటిజన్ల రియాక్షన్లు చూస్తుంటే.. ఎన్టీఆర్ ఎంత పెద్ద ఫ్యాషన్ ఐకాన్ అయ్యాడో మరోసారి స్పష్టమవుతోంది.