టాలీవుడ్ హీరోయిన్‌ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్.. బడా బిజినెస్‌మాన్‌తో పెళ్లి పీటలు!

తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, చిత్రలహరిలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. రెడ్, కాదల్ పిసాచి వంటి చిత్రాల్లో నటించిన ఆమె, అల వైకుంఠపురములో బ్లాక్‌బస్టర్ హిట్‌తో టాప్‌ రేంజ్‌లోకి చేరింది. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలతో ఫుల్ పాపులారిటీ సంపాదించింది. చివరిసారిగా భూ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.

గత రెండేళ్లుగా సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం నివేదా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా నివేదా తన బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పబోతున్నట్టు ప్రకటించింది. వినాయక చవితి రోజు సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరినీ షాక్‌కు గురిచేసింది. తన కాబోయే భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్ తో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది.

 

View this post on Instagram

 

A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj)

వీరిద్దరి పెళ్లి వచ్చే ఏడాదిలో జరగనుంది. ఈ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “సడన్ షాకిచ్చింది!” అని కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply