Robinhood Trailer: “రాబిన్ హుడ్ ట్రైలర్ అదిరింది.. క్రికెటర్ వార్నర్ మాస్ ఎంట్రీ!”

హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న “రాబిన్ హుడ్” మూవీ ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. మార్చి 28న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సినిమాలో డేవిడ్ వార్నర్ హెలికాప్టర్‌లో దిగే సీన్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. లాలీపాప్ తింటూ, swagతో నడుస్తున్న వార్నర్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆయన పాత్ర మీద సస్పెన్స్ కొనసాగుతుండగా, నితిన్ కామెడీ, యాక్షన్, బ్లాక్‌బస్టర్ బీజీఎం సినిమాపై మరింత హైప్ పెంచాయి.

ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తుండగా, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ హాస్య భరిత పాత్రలతో నవ్వులు పంచనున్నారు. ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలుండగా, ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది.

డేవిడ్ వార్నర్ పాత్ర సినిమాకు ఎంతగా మేజర్ ప్లస్ అవుతుందో, రాబోయే రోజుల్లో మనకి మరింత స్పష్టత వచ్చే అవకాశం వుంది. కానీ ట్రైలర్ చూస్తుంటే పక్కా హిట్ సినిమా అని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు!

Leave a Reply