Thammudu OTT: ఓటీటీలోకి నితిన్ ‘తమ్ముడు’.. అధికారిక ప్రకటన విడుదల!

యంగ్ హీరో నితిన్ నటించిన మాస్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ ‘తమ్ముడు’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. జూలై 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన విధంగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. అయితే ఇప్పుడు డిజిటల్ వేదికపై అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో నితిన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్లలో విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, నితిన్ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలపై చక్కటి ప్రదర్శనకు మంచి మార్కులు వేశారు. రిలీజ్ సమయంలో నుంచే ఓటీటీలో సినిమా విడుదల ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

‘తమ్ముడు’ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా ఇప్పుడు మరింత విస్తృతంగా ప్రేక్షకులకు చేరే అవకాశం ఉంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, లయ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మంచి ఫలితాన్ని ఆశిస్తోంది.

Leave a Reply