సినిమా రిలీజ్‌కు ముందే మీడియాకు ప్రివ్యూ వేయటం మామూలు విషయం కాదు. అయితే నాని నిర్మాతగా మారి, తన సినిమా మీద ఉన్న నమ్మకంతో మార్చి 12న ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా మీడియాకు చూపించాడు. నాని ధైర్యం ఎందుకంత? రామ్ జగదీష్ టేకింగ్, నేరేషన్ ప్రేక్షకులను ఎంతవరకు కట్టిపడేశాయో ఇప్పుడు చూద్దాం!
కథ:
చంద్ర శేఖర్ అలియాస్ చందు (రోషన్) ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్‌లు చేస్తూ బైక్ కొనడానికి డబ్బు కూడబెడతాడు. అతని జీవితంలోకి జాబిల్లి (శ్రీదేవీ) ప్రవేశించడంతో ప్రేమ కథ మొదలవుతుంది. అయితే ఈ ప్రేమ విషయం జాబిల్లి మామ మంగపతి (శివాజీ)కి తెలిసి, తన పలుకుబడి వాడి చందుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయిస్తాడు. చందుని కాపాడేందుకు పెద్ద లాయర్ మోహన్ రావు (సాయి కుమార్), అతని అసిస్టెంట్ తేజ (ప్రియదర్శి) రంగంలోకి దిగుతారు. చివరకు చందు ఎలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు? పోక్సో చట్టం ఏం చెబుతుంది? అన్నది కథ.
విశ్లేషణ:
పోక్సో చట్టంపై అవగాహన లేక, అమాయకులు ఎలా ప్రమాదంలో పడతారో దర్శకుడు రామ్ జగదీష్ చక్కగా చూపించాడు. మైనర్ అమ్మాయిని ప్రేమించినా, ఆమె అంగీకారంతో ముట్టుకున్నా అది నేరమేనని చెప్పే ప్రయత్నం ప్రశంసనీయము. ఫస్ట్ హాఫ్‌లో ప్రేమకథ నెమ్మదిగా నడుస్తుంది, కానీ మంగపతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో కోర్ట్ డ్రామా ఆసక్తికరంగా సాగినా, కొంతవరకు సన్నివేశాలు మరింత బలంగా రాసుంటే బాగుండేది.
నటీనటులు:
రోషన్ అమాయకపు చందుగా మెప్పించాడు. శ్రీదేవీ జాబిల్లిగా చక్కటి అభినయాన్ని అందించింది. శివాజీ మంగపతిగా అదరగొట్టాడు. ఇలాంటి పవర్‌ఫుల్ రోల్‌లో శివాజిని చూడడం నిజంగా కొత్త అనుభూతి. ప్రియదర్శి తేజ పాత్రలో హాస్యంతో పాటు, చట్టాలపై ఇచ్చిన సందేశం బాగా పండించాడు. సాయి కుమార్ లాయర్ పాత్రలో పరిమిత స్క్రీన్ స్పేస్‌లోనూ ప్రభావం చూపించాడు.
సాంకేతిక వర్గాలు:
దర్శకుడు రామ్ జగదీష్ టేకింగ్ ఆకట్టుకునేలా ఉంది. అయితే కోర్ట్ డ్రామాను మరింత గట్టి రీతిలో చూపిస్తే బావుండేది. విజయ్ బుల్గానిన్ సంగీతం, ప్రత్యేకించి బీజీఎం కథను బలపరిచింది. కెమెరా పనితీరు విజువల్స్‌లో బాగా కుదిరింది.
తుది తీర్పు:
‘కోర్ట్’ సినిమా న్యాయవ్యవస్థలోని లూప్‌హోల్స్‌ను ఎత్తిచూపిస్తూ, పోక్సో చట్టంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. నటీనటుల అభినయం, కథ చెప్పే విధానం ఆకట్టుకునేలా ఉన్నాయి. కొంతవరకు నెమ్మదిగా సాగినప్పటికీ, ఎమోషనల్ కంటెంట్ సినిమాను నిలబెట్టింది. నాని నిర్మాతగా మరో మంచి కథను అందించాడు.
ప్రజ్ఞ మీడియా రేటింగ్: 3/5