నేచురల్ స్టార్ నాని మరోసారి మాస్‌గా, ఇంటెన్స్‌గా స్క్రీన్ మీద కనిపించేందుకు సిద్ధమయ్యారు. ‘హిట్ 3’ అనే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌లో అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న నాని, తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో ప్రేక్షకుల అంచనాలను మామూలుగా పెంచలేదు!
‘హిట్’ ఫ్రాంచైజీ అభిమానులకు ఇది పెద్ద ట్రీట్ అనే చెప్పాలి. ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020)లో విశ్వక్ సేన్, ‘హిట్: ది సెకండ్ కేస్’ (2022)లో అడివి శేష్ తనదైన ముద్రవేశారు. ఇప్పుడు ‘హిట్ 3’లో నాని అరంగేట్రం చేస్తుండటంతో ఫ్రాంచైజీ స్టాండర్డ్ మరో లెవల్‌కు వెళ్ళింది.
ట్రైలర్ చూస్తే.. మిస్టరీ, మర్డర్, మైండ్ గేమ్స్ అన్నీ కలిసి టెన్షన్ ఫుల్ డ్రామా తలపిస్తున్నాయి. నాని పాత్రలోని ఆగ్రహం, లోపల దాచుకున్న ఎమోషన్స్, కేసు కి సంబంధించిన దూకుడు అన్నీ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. అడివి శేష్, నివేతా థామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ సినిమా 2025 మే 1న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
నాని ఈ సినిమాలో కేవలం హీరోగానే కాకుండా, కథా రచయిత, నిర్మాతగానూ వ్యవహరిస్తుండటంతో, ఇది ఆయనకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ‘హిట్ 3’ ట్రైలర్ చూస్తుంటే.. రక్తం మరిగే యాక్షన్, కథలో ట్విస్టులు, ఎమోషనల్ ఇంటెన్సిటీ అన్నీ బాగా ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది.
మీరు ఇంకా ట్రైలర్ చూడలేదా? ఇప్పుడే ఓ లుక్కేయండి.. అర్జున్ సర్కార్ వేరే లెవల్!