న్యాచురల్ స్టార్ నానికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజమైన నటనతో, పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్, ఫ్యామిలీ మ్యాన్ రోల్స్‌తో మెప్పించిన నాని, ఇప్పుడు మాస్ యాక్షన్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ప్రస్తుతం నాని నటిస్తున్న తాజా చిత్రం “హిట్ 3”. ఇది హిట్ సిరీస్‌కు సీక్వెల్‌గా వస్తోంది. డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం నాని ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా మీడియా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. చిత్రబృందం విజ్ఞప్తి మేరకు టికెట్ ధరలు తాత్కాలికంగా పెంచుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయం ప్రకారం..
సింగిల్ స్క్రీన్లలో ₹50 (జీఎస్టీతో కలిపి),
మల్టీప్లెక్స్‌లలో ₹75 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి లభించింది.
ఈ అదనపు ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి 7 రోజులు మాత్రమే అమల్లో ఉండనున్నాయి. దీంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ‘A’ సర్టిఫికేట్ లభించింది. కొన్ని సీన్లలో మార్పులు సూచించినట్లు సమాచారం. నాని మాస్ షేడ్స్‌లో ఎలా కనిపించబోతున్నాడో చూడాలన్న ఉత్కంఠతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.