తెలుగు ప్రేక్షకులకు ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల ద్వారా బాగా దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీతో పాటు హిందీలో కూడా పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా ఆగస్టు 1న ఆమె తన 34వ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
మృణాల్ తన స్నేహితులకు ప్రత్యేకంగా బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి తమన్నా, మౌనీ రాయ్, నుష్రత్ బరూచా, రోష్ని వాలియా వంటి ఫేమస్ సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో మృణాల్ ధరించిన డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కారణం.. అది చాలా సింపుల్‌గా కనిపించినప్పటికీ, దాని ధర మాత్రం ఆశ్చర్యపరిచేలా ఉంది!
ఈ బర్త్‌డే సందర్భంగా మృణాల్ లూయిస్ విట్టన్ ఫాల్-వింటర్ 2022 కలెక్షన్ నుంచి తీసుకున్న పూల జాక్వర్డ్ మినీ డ్రెస్‌ను ధరించింది. ఇటలీలో తయారైన ఈ డ్రెస్ ధర సుమారు రూ. 2.83 లక్షలు అని ఫ్యాషన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమాచారం తెలిసిన నెటిజన్లు “ఒక్క డ్రెస్‌తో మిడిల్ క్లాస్ కుటుంబం అరేళ్లరోజులు జీవించవచ్చు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Happy Birthday JULIET ❤️🔥
Celebrating early on the sets of #DACOIT 🔥@mrunal0801 pic.twitter.com/YqyyGyAn0H— Adivi Sesh (@AdiviSesh) July 30, 2025
సినిమాల విషయానికొస్తే, మృణాల్ ఇటీవల ‘సన్నాఫ్ సర్దార్ 2’ అనే హిందీ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘డెకాయిట్’ అనే సినిమాలో కథానాయికగా నటిస్తోంది. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అడివి శేష్ హీరోగా కనిపించనున్నారు. షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల కాబోతుంది.