Singer Mangli Injured: తీవ్ర గాయాల పాలైన సింగర్ మంగ్లీ

Singer Mangli Injured: తీవ్ర గాయాల పాలైన సింగర్ మంగ్లీ

Singer Mangli Injured: తెలంగాణ కు చెందిన  ప్రముఖ సింగర్ మంగ్లీ ప్రమాదానికి గురైంది. మంగ్లీ ప్రతి పండగకు ఒక ప్రైవేట్ సాంగ్ పాడి స్పెషల్ వీడియో షూట్ చేయించి తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంది.

ప్రస్తుతం తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా బోనాలపై ఓ ప్రైవేట్ సాంగ్ షూట్ చేస్తుంది.h

ఈ షూటింగ్ సమయంలో మంగ్లీ జారీ పడటంతో కాలికి గాయం అయిందని సమాచారం.

దీంతో యూనిట్ వెంటనే మంగ్లీని హాస్పిటల్ కి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

జానపద గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ప్రైవేట్ సాంగ్స్ తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. స్టార్ గా ఎదిగారు.

సినిమాల్లో కూడా తన గానంతో పాటల మాధుర్యాన్ని అందిస్తున్నారు. కానీ తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్న మంగ్లీ  ఇప్పటికే దాదాపు 100కి పైగా సాంగ్స్ పాడింది మంగ్లీ. మంగ్లీ పాటలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

అలాగే ఈ టాలెంటెడ్ సింగర్ మంగ్లీ శైలజారెడ్డి అల్లుడి సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించింది మంగ్లీ. ఆతర్వాత నీది నాది ఒకే కథ, జార్జ్‌ రెడ్డి, అల వైకుంఠపురం, సిటీమార్‌, లవ్‌ స్టోరీ, రంగ్‌ దే, అల్లుడు అదుర్స్‌, క్రాక్‌, పెళ్లిసందD, పుష్ప (కన్నడ), విక్రాంత్‌ రోణ, ధమకా,

మైఖేల్‌, బలగం, దాస్‌ కా ధమ్కీ వంటి హిట్‌ సినిమాల్లో పాటలు ఆలపించింది. ఇక గువ్వ గోరింక, మ్యాస్ట్రో సినిమాల్లో నటిగానూ ఆకట్టుకుంది. దీంతో ఆమె అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Leave a Reply