Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ లేటెస్ట్ లుక్ వైరల్.. కొత్త మేకోవర్‌తో గ్లోబల్ స్టార్ మాస్ అప్పీల్

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో రాబోతున్న ‘పెద్ది’ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడినాయి. దీంతో, సినిమా సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది.

తాజాగా మూవీ టీమ్ నుంచి విడుదలైన ఓ వీడియో నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ ‘పెద్ది’ లో తన కొత్త మేకోవర్ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షార్ట్ వీడియో, పోస్టర్లలో పొడవని జుట్టు, ముదురు గడ్డంతో చరణ్ లుక్ కనిపించగా.. ఇప్పుడు మరో కొత్త లుక్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చరణ్ ‘పెద్ది’ లో రెండు వేర్వేరు లుక్స్‌లో కనిపించబోతున్నాడా? అనే డౌట్ అభిమానుల్లో మొదలైందని సమాచారం.

చరణ్ కొత్త మేకోవర్, స్టైలింగ్ కోసం మూవీ టీమ్ భారతదేశపు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తో కలిసి పనిచేస్తున్నారు. ఆలిమ్ హకీమ్ సెలబ్రిటీల హెయిర్ స్టైల్స్‌లో ప్రసిద్ధి చెందారు. ఈ లుక్‌కు సంబంధించిన చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు, ఆలిమ్ హకీమ్ సెలూన్‌లో చర్చిస్తున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ అంచనాలు ఇంకా పెరుగుతున్నాయి.

సినిమా గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ 27న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహ్మాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఇప్పటికే శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది మరియు సూపర్ రెస్పాన్స్ పొందింది.

Leave a Reply