OG Movie: కోట్లాది మంది పవన్ అభిమానుల కల.. ‘OG’తో తీరుతుందా..?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ సినిమా ‘OG’ విడుదలకు సిద్ధంగా ఉంది. చాలా కాలం తర్వాత పవన్‌ను మాస్ యాంగిల్‌లో చూడని అభిమానులకు ఈ సినిమా ఒక మాస్ ఫెస్టివ్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉండబోతోంది. సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీపై క్రేజ్ ఇప్పటికే బాగా పెరిగింది. ట్రైలర్ వచ్చిన తర్వాత అభిమానుల్లో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్స్, యాక్షన్‌తో మళ్లీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.

ట్రైలర్‌లో చూపించిన సీన్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నాయి. పవన్ పాత్ర, డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ ద్వారా “వింటేజ్ పవన్ కళ్యాణ్” తిరిగి తెచ్చారు.

ఫ్యాన్స్ ఈ ట్రైలర్ చూసి ఫుల్‌ఖుషిగా ఉన్నారు. సినిమా రిలీజ్ సమయం దగ్గరగా వున్నందున, అభిమానుల ఉత్సాహం రెట్టింపు అవుతోంది. సోషల్ మీడియా పోస్టర్లు, షార్ట్ క్లిప్స్, గ్లింప్స్ ప్రతి అప్‌డేట్ అభిమానులకు ట్రీట్‌లా మారుతోంది. OG Concertలో పవన్ అభిమానులతో కనెక్ట్ అయిన హంగామా అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.

ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 2022లో DVV ఎంటర్టైన్మెంట్స్ ద్వారా “BIG ANNOUNCEMENT”తో ప్రారంభమైంది. Sujeeth ఈ మూవీ డైరెక్టర్‌గా రావడం ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. రాజకీయాల్లో బిజీ అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ సినిమా పనులు ఆలస్యం చేయలేదు. రాజకీయాలను, సినిమాను బ్యాలెన్స్ చేస్తూ వెళ్లారు.

తమన్ సంగీతం ప్రమోషన్‌లో కీలక పాత్ర వహించింది. విడుదలైన పాటలు “Firestorm”, “Suvvi Suvvi”, “Trance of OMI”, “Guns ‘n’ Roses” అన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

సినిమాకి సంబంధించిన పోస్టర్లు, క్లిప్స్, ప్రమోషన్ కార్యక్రమాలు ఏదీ మిస్ కాకుండా, చిత్రబృందం సోషల్ మీడియాలో అప్‌డేట్‌లు ఇచ్చి వస్తోంది.

సెన్సేషనల్ ట్రైలర్, పాటలు, ప్రమోషన్ ఈ మూడు అంశాలు ‘OG’పై అంచనాలను విపరీతంగా పెంచాయి. చాలా కాలం తర్వాత పవన్ పూర్తి స్థాయి యాక్షన్ మాస్ సినిమా చేస్తున్నారు. ఇది పవన్ అభిమానులకే కాక, టాలీవుడ్ ప్రేక్షకులందరికీ ఎదురుచూసిన సినిమా.

అమెరికా ప్రీమియర్ షోలు బుకింగ్స్ జోరుగా సాగాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానుల కోసం ప్రీమియర్‌లు ఈరోజు నుండే ప్రారంభం అవుతున్నాయి.

మొత్తానికి, OG అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా. పవన్ అభిమానులు ఎంతోకాలం ఎదురు చూసిన ‘OG Rampage’ నైట్ ప్రీమియర్ షోలతో ప్రారంభం కానుంది.

Leave a Reply