Mega Princess : మెగా ప్రిన్సెస్ తో మీడియా ముందుకు రాంచరణ్, ఉపాసన

Mega Princess

Mega Princess : మెగా ప్రిన్సెస్ తో మీడియా ముందుకు రాంచరణ్, ఉపాసన

Mega Princess : మెగా  స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రుల  అయ్యిన  సంగతి తెలిసిందే. జూన్ 20న మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే  డెలివరీకి ఒకరోజు ముందు నుంచి ఆమె అపోలో ఆస్పత్రిలో ఉన్నారు. తల్లీబిడ్డలు  ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ నేపధ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఉపాసన డిశ్చార్జ్

కానున్నారు. అందుకు, ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మెగా అభిమానులు, ప్రేక్షకులతో పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొందరికి ఓ సందేహం ఉంది. ఉపాసనకు నార్మల్ డెలివరీ అయ్యిందా?

లేదంటే సిజేరియన్ చేశారా? అని! మరి, ఆ విషయంలో ఈ రోజు దంపతులు ఇద్దరూ సమాధానం చెప్పే అవకాశం ఉంది!

ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘జూన్‌ 20న ఉదయం పాప పుట్టింది. ఈరోజు పాప, ఉపాసనను తీసుకుని ఇంటికి వెళుతున్నాం. తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న ఆస్పత్రి

వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు. అలాగే అభిమానులు చేసిన ప్రార్థనలు కూడా మర్చిపోలేను. మీ ఆశీస్సులు మా పాపకు ఎల్లప్పుడూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సంతోషకర

సందర్భంలో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇప్పటికే ఉపాసన, నేను ఓ పేరు అనుకున్నాం. అది 21వ రోజున వెల్లడిస్తాం. చాలా సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. అనుకున్న

సమయంలో భగవంతుడు మాకు పాపను ప్రసాదించాడు’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

అలాగే రామ్ చరణ్, ఉపాసన దంపతులకు బిడ్డ జన్మించిన రోజున మెగాస్టార్ చిరంజీవి మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అనేది అందరికీ తెలిసిన విషయమే.

హనుమంతునికి ప్రీతికరమైన రోజు మంగళవారం. ఆ రోజు అమ్మాయి పుట్టడంతో మెగాస్టార్ మరింత సంబరపడ్డారు. తన ఆనందం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ విజయాలు, వరుణ్ తేజ్ నిశ్చితార్థం,

మనవరాలు పుట్టడం… తమ ఇంట అన్నీ శుభకార్యాలు జరుగుతున్నాయని తెలిపారు.

 

Leave a Reply