జూనియర్ ఎన్టీఆర్ (NTR) తొలిసారి బాలీవుడ్లో నటించిన ‘వార్ 2’ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో?
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ‘వార్ 2’ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ చిత్రం 2025 అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి. హిందీ, తెలుగు సహా పలు భాషల్లో ప్రసారం అయ్యే అవకాశముందని చెబుతున్నారు.
ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్, కియారా అద్వానీ, అశుతోష్ రానా, అనిల్ కపూర్, అరీస్టా మెహతా వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని ప్రీతమ్, సంచిత్ బాలహారా, అంకిత్ బాలహారా అందించారు.
యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కింది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ మ్యూజిక్, స్టార్ స్టడెడ్ నటీనటులు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
#War2OnNetflix – Streaming from 9th Oct. Congrats & all d best team pic.twitter.com/gtrXfouoz0
— Annamalai Suchu (@actor_annamalai) September 28, 2025
ఓటీటీలో ఎంజాయ్ చేసే ఛాన్స్
థియేటర్లలో మంచి ఓపెనింగ్ సాధించిన ‘వార్ 2’ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే నిజంగా అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందా లేదా అన్నది అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. థియేటర్లో మిస్ అయిన వారు, ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసే అవకాశముంది.