Chiranjeevi : మెగా ప్రిన్సెస్ అంటూ చిరు ట్వీట్ వైర‌ల్‌

Chiranjeevi

Chiranjeevi:మెగా ప్రిన్సెస్ అంటూ చిరు ట్వీట్ వైర‌ల్‌

Chiranjeevi: మెగా వారసురాలు రావడంతో మెగా వారి ఇంట సంబరాలు మిన్నంటాయి.

ప్రముఖ నటుడు రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.

బిడ్డ పుట్టడంతో అటు మెగా, ఇటు కామినేని కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి.

రామ్‌చరణ్‌ తన కూతురిని చూసి మురిసిపోయారని ఆయన సన్నిహితులు తెలిపారు.

మెగా ప్రిన్సెస్‌ పుట్టిందంటూ మెగా ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరు కుటుంబాల సభ్యులు ఈరోజు ఉదయం 7 గంటలకు ఆసుపత్రికి వెళ్లి రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, బిడ్డను ఆశీర్వదిస్తారని తెలిపింది.

ఇక 2012లో రామ్‌చరణ్ ఉపాసనల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నట్టు మెగా, కామినేని   కుటుంబాలు గతేడాది నవంబర్ 12న వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు.

సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారని, తాము దానికి పూర్తి భిన్నమని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం తాను, చరణ్‌..

అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నామని, బేబీ పుట్టిన తర్వాత అత్తమామల (చిరంజీవి- సురేఖ)తోనే ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

తమ ఎదుగుదలలో గ్రాండ్‌ పేరెంట్స్‌ కీలక పాత్ర పోషించారని, గ్రాండ్‌ పేరెంట్స్‌తో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదని వివరించారు.

Leave a Reply