పద్మశ్రీ అందుకున్న ఎం.ఎం.కీరవాణి

Padma Awards:  పద్మశ్రీ అందుకున్న  ఎం.ఎం.కీరవాణి

ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు గాను ఎంఎం కీరవాణి గతంలో ఆస్కార్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్, హెచ్ సీఏ అవార్డులను గెలుచుకున్నా సంగతి అందరికీ తెలిసిందే.  కాగా ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణికి భారత అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డు లభించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటడంలో కృషి చేసినందుకు గానూ ఏపీ నుంచి ఈ ఆవార్డుకు ఆయన ఎంపిక అయ్యారు.న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ ఆస్కార్ అవార్డు కార్యక్రమానికి కీరవాణి గారు ఆల్ బ్లాక్ సూట్ ధరించి కనిపించారు.

అలాగే “చిత్రకళకు గాను శ్రీ మరకతమణి కీరవాణి గారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీ ప్రదానం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, గేయరచయిత అయిన ఆయన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో విస్తృతంగా పనిచేశారు” అంటూ రాష్ట్రపతి గారి ట్విటర్ అకౌంటు ద్వారా మాన కీరవాణి గారికి పద్మశ్రీ ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు.

ఎంఎం కీరవాణి గారు అమెరికాలో విజయపరంపరలో దూసుకెళ్తూ రాష్ట్రాల్లో పలు అవార్డులు సాధించి భారతీయులను అన్ని చోట్లా గర్వపడేలా చేసింది. తనకు పద్మశ్రీ అవార్డు రావడంపై సంగీత దర్శకుడు గతంలో స్పందించారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు, కవితపు సీతన్న గారి నుంచి కుప్పాల బుల్లిస్వామి నాయుడు గారి వరకు నా మార్గదర్శకులందరికీ నా నమస్కారాలు.  భారత  ప్రభుత్వం నుంచి పౌర పురస్కారం రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఎంఎం కీరవాణి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

అలాగే అటు తెలంగాణ నుంచి అధ్యాత్మిక రంగంలో చినజీయర్  స్వామి, కమలేశ్‌ డి పటేల్‌లకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించిన కేంద్రం  వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్‌, తొమ్మిది మందిని పద్మభూషణ్‌, 91మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12మందిని పద్మ పురస్కారాలు వరించాయి.

Leave a Reply