స్క్రీన్ ప్లే & దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి
నిర్మాతలు: K.Y.బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల
బ్యానర్: థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్
విడుదల: SVC
డిఓపి: సుజాత సిద్దార్థ్
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: మధు
తెలుగు ప్రేక్షకులకు సప్తగిరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించిన అతడు, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ లాంటి సినిమాలతో హీరోగా కూడా ప్రయత్నించాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ‘పెళ్లి కాని ప్రసాద్’ అనే చిత్రంతో మళ్లీ హీరోగా మెప్పించాడా? అనే ఆసక్తి అందరిలో ఉంది.
కథ:
ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలో ఒక స్టార్ హోటల్లో పని చేస్తూ ఉంటాడు. అతని తండ్రి (మురళీధర్) పూర్వీకుల సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడానికి కనీసం రూ. 2 కోట్లు కట్నంగా రావాలి అని చెబుతాడు. తండ్రి మాటను అతడు పాటిస్తూ, ఆ అర్థంతోనే సంబంధం కోసం చూస్తుంటాడు.
అందులో భాగంగా అతనికి ప్రియ (ప్రియాంక శర్మ) పరిచయం అవుతుంది. తన తల్లిదండ్రులు, అమ్మమ్మతో కలిసి విదేశాల్లో సెటిల్ కావాలనే కోరికతో ప్రియ, ప్రసాద్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటుంది. కానీ పెళ్లి తర్వాత ఫారిన్ వెళ్ళిపోవాలన్న ప్రియ కోరికకు, మలేషియాలోనే ఉండాలన్న ప్రసాద్ నిర్ణయానికి మధ్య పెద్ద వివాదం జరుగుతుంది.
అసలు ప్రసాద్ విదేశాలకు ఎందుకు వెళ్లకూడదు అనుకున్నాడు? పెళ్లి తర్వాత అతని జీవితంలో ఎలాంటి అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి? చివరికి “పెళ్లి కాని ప్రసాద్” ఎలా “పెళ్లైన ప్రసాద్” అయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
సప్తగిరి.. కామెడీ ప్రధానమైన పాత్ర కావడంతో, తనదైన మార్క్ హాస్యంతో ఆకట్టుకున్నాడు. పెళ్లి వయస్సు దాటుతున్న ఓ యువకుడిగా, తండ్రి మాటను గౌరవిస్తూ ఇబ్బంది పడే యువకుడిగా, ప్రేమలో పడిన కుర్రాడిగా, చివరికి బాధపడే భర్తగా అన్ని షేడ్స్‌ను ప్రదర్శించాడు. ప్రియాంక శర్మ.. గ్లామర్ పరంగా బాగానే చేసింది కానీ, నటనకు పెద్దగా స్కోప్ లేకపోయింది. మురళీధర్ గౌడ్.. తండ్రిగా, తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, పాషా, ఇతర పాత్రలు కథ ప్రకారం బాగానే నెరవేర్చారు.
టెక్నికల్ హైలైట్స్:
శేఖర్ చంద్ర సంగీతం.. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్.
సినిమాటోగ్రఫీ.. సుజాత సిద్దార్థ్ అందించిన విజువల్స్ సినిమాకి కొత్త లుక్ తీసుకొచ్చాయి.
దర్శకత్వం.. అభిలాష్ రెడ్డి గోపిడి కథ బలహీనంగా ఉన్నా, సిచువేషనల్ కామెడీతో కవర్ చేయడానికి ప్రయత్నించాడు.
ఎడిటింగ్.. కొన్ని చోట్ల లాగ్ అనిపించినప్పటికీ, మధు ఎడిటింగ్ ఓకే.
విశ్లేషణ: కామెడీ బాగుంది, కానీ కథలో కొత్తదనం లేదు. సప్తగిరి ఎలిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. క్లైమాక్స్ మరింత grippingగా ఉంటే బాగుండేది.
ఫైనల్ వెర్డిక్ట్: కామెడీ లవర్స్ కి ఓసారి చూడదగిన సినిమా!
ప్రజ్ఞ మీడియా రేటింగ్: 2.5/5