Mohanlal: మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్..!

ఆరుపదుల వయసు దాటినా సినీ పరిశ్రమలో తనదైన శైలితో దూసుకుపోతున్న మలయాళ స్టార్ మోహన్ లాల్, పుట్టినరోజున అభిమానులకు ప్రత్యేకంగా గుడ్ న్యూస్ చెప్పారు. చిన్న పాత్రలతో ప్రారంభించిన ఈయన నటనా ప్రయాణం, 45 ఏళ్లలోనే లెజెండరీ స్థాయికి చేరింది. 2 నేషనల్ అవార్డులు, 5 కేరళ రాష్ట్ర అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్‌తో సహా అనేక పురస్కారాలు అందుకున్న మోహన్ లాల్ ఇప్పటివరకు దాదాపు 340కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. నేడు ఆయన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

‘ముఖరాగం’ పేరిట ఆత్మకథ
ఈ సందర్భంగా తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను ‘ముఖరాగం’ అనే పుస్తకంలో వెలుగులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ పుస్తకంలో గత 47 ఏళ్ల నా సినీ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు, అంశాలను గురించి వివరించారు. రచయిత భాను ప్రకాష్ రచించిన ఈ పుస్తకం దాదాపు వెయ్యి పేజీలతో ఉండనుందని, మలయాళంలో ప్రముఖ రచయిత వాసుదేవన్ నాయర్ ముందుమాట రాశారని చెప్పారు. ఈ పుస్తకం 2025 డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సమాచారం తెలియజేస్తూ మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా వీడియో షేర్ చేశారు.

‘కన్నప్ప’ గ్లిమ్ప్స్ ట్రీట్‌
ఇక పుట్టినరోజు సందర్భంగా మోహన్ లాల్ మరో స్పెషల్ గిఫ్ట్ అందుకున్నారు. ఆయన నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలోని గ్లిమ్ప్స్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో మోహన్ లాల్ ‘కిరాత’ పాత్రలో అలరించనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a Reply