‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన హీరో తేజ సజ్జ, తాజాగా ‘మిరాయ్’ అనే విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో మనోజ్ పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించగా, తేజ సజ్జ చేసిన యాక్షన్ సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పించేవిగా ఉన్నాయి.
వీఎఫ్ఎక్స్ టాప్ క్లాస్‌గా ఉండటంతో టీజర్ మొత్తం హాలీవుడ్ స్థాయిని తలపించేలా ఉంది. టీజర్ ప్రారంభంలో మనోజ్ మాస్ ఎంట్రీ ఆకట్టుకోగా, క్లైమాక్స్‌లో రాముడి రాక చూపించిన విజువల్స్ హైక్లాస్‌గా నిలిచాయి. ముఖ్యంగా తేజ చేసిన రిస్కీ యాక్షన్ సీన్స్, ఆయన డెడికేషన్ స్పష్టంగా కనిపించాయి.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ‘మిరాయ్’ ఈ ఏడాది సెప్టెంబర్ 5న ఏకకాలంలో 7 భాషల్లో విడుదల కానుంది.