Mirai VFX: ‘మిరాయ్’ మూవీ విజువల్స్ అదిరిపోయాయ్.. కార్తీక్ ఘట్టమనేని టెక్నికల్ బ్రిలియన్స్ కి ప్రేక్షకుల ఫిదా

యంగ్ హీరో తేజా సజ్జా – కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో తెరకెక్కిన మిరాయ్ నేడు భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్‌ వద్ద అదరగొడుతోంది. ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ బ్లాక్‌బస్టర్ రేంజ్ రివ్యూలు అందుకుంటోంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్, నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ చిత్రం ఒక కొత్త థియేటర్ అనుభూతిని కలిగిస్తోందని ప్రేక్షకులు, విమర్శకులు, సినీ విశ్లేషకులు ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నారు.

టెక్నికల్ బ్రిలియన్స్

ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న అంశం వీఎఫ్ఎక్స్. కేవలం రూ. 60 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న విజువల్స్ అందించడం కార్తీక్ ఘట్టమనేని టెక్నికల్ బ్రిలియన్స్ అని అంటున్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి చేసిన సినిమాల్లో కూడా ఇంత నాణ్యత ఉండదని చాలామంది ప్రశంసిస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఇది తక్కువ బడ్జెట్ మూవీ అని ఎక్కడా అనిపించదని చెబుతున్నారు.

హైలైట్ సీన్స్

ఫాంటసీ ప్రపంచం, పౌరాణిక అంశాలను వీఎఫ్ఎక్స్ సహాయంతో అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సీక్వెన్స్‌లు, భారీ పక్షి విజువల్స్ వంటి సన్నివేశాలు ప్రేక్షకులను హాలీవుడ్ అనుభూతి కలిగించాయని ఫీల్ అవుతున్నారు. యాక్షన్, వీఎఫ్ఎక్స్‌తో పాటు కథలోని ఎమోషన్, డివోషన్ కూడా ప్రేక్షకులను బాగా కట్టిపడేస్తున్నాయి.

బడా సినిమాలకు సవాల్

ఇటీవలే భారీ బడ్జెట్ సినిమాలు ఆదిపురుష్, హరిహరవీరమల్లు వీఎఫ్ఎక్స్ నాణ్యతపై విమర్శలు ఎదుర్కొన్నాయి. అలాంటి సమయంలో చిన్న బడ్జెట్‌తో వచ్చిన మిరాయ్ మాత్రం అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇంతకు ముందు మహావతార్ నరసింహా, కొత్త లోక వంటి ప్రాజెక్టులు కూడా చిన్న బడ్జెట్‌లో మంచి విజువల్స్ అందించిన సంగతి తెలిసిందే. దీంతో “పెద్ద బడ్జెట్ అవసరం లేకుండానే మంచి విజన్, ప్లానింగ్ ఉంటే అద్భుతాలు చేయవచ్చు” అని సినీ అభిమానులు అంటున్నారు.

Leave a Reply