Megastar Chiranjeevi :మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్.. ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్ అదిరింది!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్‌కి పవర్‌ఫుల్ గిఫ్ట్ అందించారు. అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #Mega157 సినిమాకు అధికారికంగా టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి “మన శంకరవరప్రసాద్ గారు” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చిరంజీవి అసలు పేరుతో టైటిల్ పెట్టడం ఫ్యాన్స్‌కి మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ఫ్యాన్స్‌ని ఫుల్ జోష్‌లోకి నెట్టేసింది. బ్లాక్ సూట్‌లో స్టైలిష్‌గా కారులో నుంచి దిగి, సిగరెట్ వెలిగించి తనదైన స్టైల్లో నడుచుకుంటూ వస్తున్న చిరు ఎంట్రీ గూస్‌బంప్స్ తెప్పించింది. వెనకన 5, 6 మంది గన్మెన్లు ఉండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో “బాస్.. బాస్.. బాస్..” అంటూ వినిపించిన వాయిస్ ఓవర్ ఫ్యాన్స్‌ని మాస్ ఫీస్ట్‌లో ముంచేసింది. అంతేకాకుండా చిరంజీవి క్లాసిక్ మూవీ “రౌడీ అల్లుడు”లోని “లవ్ మీ మై హీరో” సాంగ్‌కి రీమిక్స్ వర్షన్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించగా, వింటేజ్ మెగాస్టార్ వైబ్స్ పంచింది. చివర్లో వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో – “మన శంకరవరప్రసాద్ గారు.. పండగకి వచ్చేస్తున్నారు!” అనే డైలాగ్ మజా మరింత పెంచేసింది.

గ్లింప్స్ చూస్తే ఈ చిత్రం మాస్, యాక్షన్, స్టైల్, కామెడీ కలగలిపిన హోల్‌సమ్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో చిరంజీవి ఒక పవర్‌ఫుల్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిన ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇందులో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. “గాడ్ ఫాదర్”, “సైరా నరసింహా రెడ్డి” తర్వాత చిరంజీవి – నయనతార కాంబోలో వస్తున్న ఇది మూడవ సినిమా కావడం విశేషం.

డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. “భగవంత్ కేసరి”, “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రాలతో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తున్న ఆయన, ఇప్పుడు మెగాస్టార్‌తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Leave a Reply