మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ 47 ఏళ్లు.. మొదటి రెమ్యునరేషన్ ఎంత తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలై నేటితో 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, మెగాస్టార్ కూడా 47 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆ చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు తనను ఆదరించి, అభిమానించిన తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని తెలిపారు. “ఈ 47 ఏళ్లలో నేను పొందిన అవార్డులు, గౌరవాలు కాదు, మీ అందరివీ, మీరందించిన అభిమానమే నా నిజమైన సత్తా.”

‘ప్రాణం ఖరీదు’కు సంబంధించిన ఆసక్తికర విషయాలు

మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాక, ఈ సినిమాతో మరో లెజెండరీ నటుడు కోట శ్రీనివాస్ రావు కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కోట ఒక చిన్న పాత్రలో నటించినప్పటికీ, ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది.

చిరంజీవి ఫస్ట్ రెమ్యునరేషన్

తొలి సినిమాకు చిరంజీవి కేవలం రూ. 1,116 పారితోషికం పొందారు. కెరీర్ ప్రారంభంలో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన, 1992లో ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో రూ. 1.25 కోట్లు పొందారు. కేవలం 5 ఏళ్లలో, రూ. 1,116 నుంచి రూ.1.25 కోట్లుకు ఎదిగిన మెగాస్టార్, భారతీయ సినిమా పరిశ్రమలో కోటి రెమ్యునరేషన్ పొందిన తొలి హీరోగా నిలిచారు.

‘ప్రాణం ఖరీదు’ చిత్రాన్ని C.S. Rao రచించిన నాటకం ఆధారంగా K. Vasu తెరకెక్కించారు. చిరంజీవి హీరోగా నటించగా, చంద్రమోహన్, మాధవి, కోట శ్రీనివాస్ రావు, రావు గోపాల్ రావు ముఖ్య పాత్రలు పోషించారు. సంగీతం కె. చక్రవర్తి అందించారు.

తొలి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మెగాస్టార్, ఆ తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడలేదు. 47 ఏళ్ల సినీ కెరీర్‌లో 155కి పైగా చిత్రాలతో అభిమానులను అలరించారు.

ప్రస్తుతం మెగాస్టార్ 4 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు:

విశ్వంభర

మన శంకర వరప్రసాద్

చిరు ఓదెల (ప్రీ ప్రొడక్షన్ దశలో)

చిరు బాబీ2 (ప్రీ ప్రొడక్షన్ దశలో)

ఈ సినిమాలు అతి త్వరగా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

Leave a Reply