‘తు మేరా లవర్’ సాంగ్ రీలీజ్.. మాస్ మహారాజ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా!

మాస్ మహారాజ రవితేజ నుంచి మరో ఫుల్ మాస్ ట్రీట్ వచ్చేసింది. ‘మాస్ జాతర’ సినిమా నుంచి తాజాగా విడుదలైన “తు మేరా లవర్” అనే పాట అభిమానుల్లో మంచి ఉత్సాహం నింపుతోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ తన స్టైల్ లో అదరగొడుతుంటే, మ్యూజిక్, లిరిక్స్, డ్యాన్స్ అన్నీ మాస్ ప్రేక్షకులకు కావాల్సిన మాస్ ప్యాకేజీలా ఉన్నాయి.

ఈ పాటకు సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో, భాస్కరభట్ల లిరిక్స్ అందించగా, దివంగత గాయకుడు చక్రి వాయిస్‌ను AI సాయంతో పునర్నిర్మించారు. ఇది ఫ్యాన్స్‌కు ఒక ఎమోషనల్ కనెక్షన్‌గా మారింది. పైగా, ఈ సాంగ్‌కు భాను మాస్టర్ తనదైన మూమెంట్స్ తో డ్యాన్స్ కంపోజ్ చేయడంతో, రవితేజ తన ఇడియట్ స్టైల్ స్టెప్పులతో మళ్ళీ పూర్వవైభవాన్ని గుర్తు చేశాడు.

వీడియోలోని ఎనర్జీ, మ్యూజిక్ బీట్‌కు తగ్గ స్టెప్పులు ఈ పాటను సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ చేస్తుండగా, మాస్ మహారాజ అభిమానులు థియేటర్స్‌లో మరోసారి డాన్సులతో తమ అభిమాన హీరో అలరించటం ఖాయంగా కనిపిస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ ఎమోషన్, మాస్ ఎంటర్టైన్మెంట్, పవర్‌ఫుల్ పాటల కలయికతో మాస్ జాతర భారీ హిట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Leave a Reply