Kannappa Piracy: ‘కన్నప్ప’ పైరసీపై మంచు విష్ణు ఆవేదన.. ఇది దొంగతనమే.. సపోర్ట్ చేయండి..!

మంచు విష్ణు నటించిన పాన్‌ఇండియా సినిమా ‘కన్నప్ప’ పైరసీ బారిన పడింది. సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఫుల్ HD ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం సినీ యూనిట్‌కు షాక్ ఇచ్చింది. వేలాది పైరసీ లింకులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుండటంతో మేకర్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో హీరో మంచు విష్ణు స్పందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
“ప్రియమైన సినిమా అభిమానులారా.. మా ‘కన్నప్ప’ సినిమా పైరసీ బారిన పడింది. ఇప్పటివరకు 30,000కి పైగా అక్రమ లింకులను తొలగించాం. ఇది చాలా బాధాకరం. పైరసీ అనేది ఒక దొంగతనం. మనం మన పిల్లలకు దొంగతనం చేయమని నేర్పించం కదా? అదే విధంగా పైరసీ కంటెంట్ చూడడం కూడా తగదు. దయచేసి సినిమాను నేరుగా థియేటర్‌లలో చూసి మద్దతు ఇవ్వండి. హర్ హర్ మహాదేవ్.” అంటూ ట్వీట్‌ చేశారు.

కన్నప్ప పైరసీ సమస్య మేకర్స్‌ను తీవ్రంగా కలవరపెట్టిందని తెలుస్తోంది. సినిమా కలెక్షన్లపై కూడా ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, సినీ పరిశ్రమ మొత్తం ఈ పరిణామాన్ని గమనిస్తోంది. పైరసీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని చిత్ర బృందం కోరుతోంది.

Leave a Reply