రియల్ ఎస్టేట్ ప్రమోషన్‌కు సంబంధించిన వివాదంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చిక్కుల్లో పడ్డారు. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను ప్రమోట్ చేసినందుకు మహేశ్‌బాబును మూడో ప్రతివాదిగా చేర్చి ఓ ఫిర్యాదు దాఖలైంది.
వివరాల్లోకి వెళ్తే.. బాలాపూర్ గ్రామంలో రెండు ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు, సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తా మాటలు నమ్మి మొత్తం రూ.34.80 లక్షలు చెల్లించారు. బ్రోచర్లో మహేష్ బాబు ఫొటో ఉండటంతో సంస్థపై నమ్మకం వచ్చిందని వారు పేర్కొన్నారు. అయితే తర్వాత ప్లాట్లకు సరైన అనుమతులు లేవని తెలిసి డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా, యజమాని రూ.15 లక్షలు మాత్రమే వాయిదాలుగా చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని ఇవ్వకుండా ఆలస్యం చేయడంతో, వారు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
SHOCKING‼️
*హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు*
*సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు*
*యాడ్స్‌కు రూ.3.4 కోట్లు తీసుకున్నట్టు గుర్తించిన ఈడీ* pic.twitter.com/duBAjMbmaI
— G3 (@gayatri008_16) April 22, 2025
ఈ కేసు నేపథ్యంలో సినీ నటుడు మహేష్ బాబుకి సోమవారం విచారణకు హాజరుకావాలని కమిషన్ నోటీసులు పంపింది.
ఇదే కేసులో మహేష్ బాబుకు గతంలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కూడా నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్ మరియు సాయి సూర్య డెవలపర్స్ లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన విచారణకు హాజరుకావాలని ఏప్రిల్ 27న ఈడీ అధికారుల నుంచి సమన్లు వెళ్లాయి. ఈ కేసులో యాడ్స్‌కు రూ.3.4 కోట్లు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు.